Sperm count is declining at accelerating rate worldwide: study
mictv telugu

మగవాళ్లూ బీ అలర్ట్.. తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్

November 16, 2022

Sperm count is declining at accelerating rate worldwide: study

మగవాళ్లూ.. కాస్త అలర్ట్‌గా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే తీవ్ర పర్యావసానాలు తప్పదంటున్నారు వైద్య నిపుణులు. అందుకు ముఖ్య కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణీయంగా పడిపోవడమేనంటున్నారు. దీనిపై పరిశోధన చేసిన ఓ అంతర్జాతీయ పరిశోధకులు బృందం సంవత్సరాల తరబడి మగవారిలో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు కనిపించిందని చెబుతున్నారు. హ్యామన్ రిప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్‌లో మంగళవారం ఈ విషయాన్ని ప్రచురించింది. మొత్తం 53 దేశాల డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. 2011-2018 మధ్య ఏడు సంవత్సరాల్లో డేటాను సేకరించి వీర్యకణాల సంఖ్యపై అధ్యయనం చేశారు.

మన దేశంలో కూడా వీర్యకణాల క్షీణత కనిపిస్తోందని ఇజ్రాయిల్ లోని జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హగై లెవిన్ తెలిపారు. గత 46 ఏళ్లలో 50 శాతానికి పైగా వీర్యకణాల క్షీణత కనిపిస్తుందని.. ఇటీవల సంవత్సరాల్లో ఇది వేగవంతం అయిందని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. సంతానోత్పత్తి, ఆ తర్వాత మానవ మనుగడపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.

వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. శారీరక వ్యాయామాన్ని రోజువారీ జీవనంలో భాగం చేసుకోవాలంటున్నారు. మద్యం, పొగతాగడానికి దూరంగా ఉండాలని , బిగుతైన లోదుస్తులు ధరించకూడదని, ముఖ్యంగా కింది భాగంలో వేడి పెరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.