ఈ వీర్యదాత లాక్‌డౌన్‌లోనూ ఫుల్ బిజీ.. 150 ప్లస్ 6 - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వీర్యదాత లాక్‌డౌన్‌లోనూ ఫుల్ బిజీ.. 150 ప్లస్ 6

September 30, 2020

sperm donor with 150 children worldwide who's had unprotected  scores of women

ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన వాడిగా రికార్డులకెక్కిన ప్రఖ్యాత వీర్యదాత జీవితం మూడు మంచాలు, ఆరు పిల్లలుగా సాగిపోతోంది. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా అతడు ఫుల్ బిజీగా కాలం గడిపేస్తున్నాడు. అవసరమైనవారికి వీర్యం అందిస్తూ, పడకను పంచుకుంటూ రెచ్చిపోతున్నాడు. 

అమెరికాలోని వెర్మాంట్‌కు చెందిన 49 ఏళ్ల జోయ్ కథ ఇది. ‘జోయ్ డోనర్’గా పేరొందిన ఇతగాడు వందమందికిపైగా మహిళలకు వీర్యదానం చేసి 150 మందిని కన్నాడు. లాక్‌డౌన్‌లో మరో ఐదుగురు మహిళలకు సంతాన ప్రాప్తి కల్పించాడు. కృత్రిమ గర్భధారణతో కాకుండా వారితో నేరుగా పడక పంచుకుని మరీ ఈ ఘనకార్యం వెలగబెట్టాడు. ప్రస్తుతం వారిలో ఒకరు బిడ్డను కనేశారు. ఒకరికి  పిల్లలు పుట్టబోతున్నారు. ఈ ఏడాదిలో కనీసం 10 మందిని గర్భవతులను చెయ్యాలన్నది తన టార్గెట్ అని జోయ్ చెబుతున్నాడు. ఇప్పటి వరకు తనకు పుట్టిన 150 మందిలో సగం మంది సెక్స్ ద్వారా పుట్టిన వాళ్లేనని అతడు అంటున్నాడు. పైసా డబ్బు తీసుకోకుండా ఈ సంఘసేవ చేస్తున్నానని, ప్రయాణ ఖర్చులకు వీర్యగ్రహీతలే డబ్బులిస్తుంటారని వివరిస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో అతడు ఎక్కువ రోజు అర్జెంటీనాలో గడిపాడు. ప్రస్తుతం ‘అదే పని’పై లండన్‌లో తిష్టవేశాడు. ఫేస్‌బుక్ ద్వారా తనకు చాలా రిక్వెస్టులు వస్తుంటాయని, సాధ్యమైనంత మేరకు అందరికి సంతాన భాగ్యం కల్పించడానికి ప్రయత్నిస్తానని జోయ్ చెబుతుంటాడు. మొత్తం 2500 మంది పిల్లలకు తండ్రి కావాలన్నది అతన జీవిత లక్ష్యం!