వీడియో : ల్యాండింగ్ టైంలో కుదుపేసిన స్పైస్ జెట్.. 10 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : ల్యాండింగ్ టైంలో కుదుపేసిన స్పైస్ జెట్.. 10 మందికి గాయాలు

May 2, 2022

ముంబై నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు వెళ్తున్న స్పైస్ జెట్ విమానం ఆదివారం ల్యాండింగ్ సమయంలో తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో ఏం జరుగుతోందోనని ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానం లోపల ప్రయాణీకుల సామాన్లు, బ్యాగులు, ఇతర వస్తువులు చెల్లాచెదురయ్యాయి. లగేజీ బ్యాగులు మీదపడి పది మంది ప్యాసింర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనను కొందరు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. అయితే ఎట్టకేలకు విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే గాయపడిన ప్రయాణీకులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విమాన సర్వీసుల కంపెనీ స్పైస్ జెట్ విచారం వ్యక్తం చేసింది. ఇందుకు గల కారణాలను అన్వేషిస్తున్నామని, ఇంకోసారి ఇలా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.