స్పైస్ జెట్ బంపరాఫర్..ఫ్రీగా విమానంలో ప్రయాణించండి! - MicTv.in - Telugu News
mictv telugu

స్పైస్ జెట్ బంపరాఫర్..ఫ్రీగా విమానంలో ప్రయాణించండి!

February 4, 2020

SpiceJet.

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రయాణికులకు బంపర్ అఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉచితంగా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే వారికి ఈ ఉచిత విమాన టికెట్ ఆఫర్ అందుబాటులో ఉంది. కంపెనీ టికెట్ బేస్ ఫేర్‌ను పూర్తిగా రద్దు చేస్తుంది. కేవలం పన్నులు, ఇతర సర్‌చార్జీలను చెల్లిస్తే సరిపోతుంది. ఉచిత టికెట్ పొందాలని భావించే వారు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

స్పైస్ జెట్ కొత్తగా స్పైస్ డెమోక్రసీ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఉచిత టికెట్లను అందిస్తోంది. ఫిబ్రవరి 8న ఢిల్లీ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నవారికి టికెట్ బేస్ ఫేర్‌ను రిఫండ్ చేయనుంది. ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 6న ఉచిత టికెట్లకు ఎంపికైన వారి పేర్లను వెల్లడిస్తారు. ఉచితంగా టికెట్ పొందిన వారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత చేతి వెలికి ఉన్న సిరా గుర్తుతో ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రొఫైల్స్‌గా పెట్టుకోవాలని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది.