SpiceJet says passengers deplaned in Delhi for 'unruly behaviour'. Video
mictv telugu

విమానంలో ప్రయాణికుడి వికృత చేష్టలు..

January 24, 2023

SpiceJet says passengers deplaned in Delhi for 'unruly behaviour'. Video

విమానాల్లో ఇటీవల తరచూ అనుచిత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన మరో ఘటన వెలుగు చూసింది. ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రయాణించడంతో పాటు విమాన సిబ్బందిని వేధించినట్లు స్పైస్ జెట్ విమానయాన సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని పైలట్ ఇన్ కమాండ్ తో పాటు భద్రతా సిబ్బందికి తెలియజేసినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఫలితంగా ఆ వ్యక్తితోపాటు ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని విమానం నుంచి దించినట్లు పేర్కొంది. అనంతరం వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. విమానాల్లో అనుచిత ఘటనలు జరిగినప్పుడు తెలియజేయాలని ఇటీవల DGCA ఆదేశించిన నేపథ్యంలో స్పైస్ జెట్ ఈ విషయాన్ని బయటపెట్టింది.

విమానంలో ప్రయాణీకులు దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ ఏడాది జనవరి 9న ఢిల్లీ నుంచి పాట్నా వస్తున్న విమానంలో డ్రగ్స్‌కు బానిసైన యువకులు ఎయిర్ హోస్టెస్, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి రావడం విశేషం. దీని తర్వాత, పాట్నా విమానాశ్రయంలో మద్యం తాగి రచ్చ సృష్టించిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. అంతే కాదు.. గతేడాది డిసెంబర్ 29న బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వస్తున్న థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో సీటు విషయంలో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.పలువురు ప్రయాణీకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇది కాకుండా.. డిసెంబర్ 2022 లో ఇండిగో ఎయిర్‌లైన్ విమానంలో ఎయిర్ హోస్టెస్,ప్రయాణీకులు ఇద్దరూ ఒకరినొకరు అరిచుకున్న వీడియో బహిర్గతమైంది. ప్రయాణీకుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించాడు.ఎయిర్ హోస్టెస్‌ను అవమానించాడు, ఆ తర్వాత భద్రత సిబ్బంది జోక్యం చేసుకోవలసి వచ్చింది.