Spider-man doing the Kirak dance..
mictv telugu

వీడియో: కిరాక్‌ డ్యాన్స్‌ వేసిన స్పైడర్‌ మ్యాన్‌..నవ్వులే నవ్వులు

August 11, 2022

Spider-man doing the Kirak dance..

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో ఉన్న శాంతినికేతన్‌లోని సోనాజురిలోని మార్కెట్‌లో స్పైడర్‌ మ్యాన్‌ మాస్ డ్యాన్స్ వేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అతని డ్యాన్స్‌ను వీక్షించిన అక్కడి మహిళలు పడి పడి నవ్వుకున్నారు. ప్రస్తుతం స్పెడర్ మ్యాన్ వేసిన మాస్ డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీడియోలో.. సంతాలీ సంగీతంలో ఉన్న ఓ జానపద పాటకు స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి స్టెప్పులు ఇరగదీస్తున్నాడు. మహిళలతో కలిసి అతడు డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తూ, ముందుకు సాగుతున్నాడు. పక్కన కూర్చోని అతని డ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న సంతాలీ మహిళలు పడి పడి నవ్వుకుంటున్నారు. వాయిద్యాలు నడుమ దరువుకు తగ్గట్టుగా కిరాక్‌ డ్యాన్స్‌ చేసిన స్పైడర్‌ మ్యాన్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ మిస్టర్ అనే స్పైడర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక, హాలీవుడ్‌లో స్పెడర్‌ మ్యాన్‌ మూవీ ఎంత భారీ హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా టీవీల్లో వచ్చిందంటే పడి పడి చూసేవాళ్లు చాలామంది ఉన్నారు. అంతేకాదు, స్పైడర్‌ మ్యాన్‌ సినిమా సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇక, ఇండియాలో సైతం ఈ సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.