స్పైడర్ టీజర్ సూపర్ - MicTv.in - Telugu News
mictv telugu

స్పైడర్ టీజర్ సూపర్

June 1, 2017

ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ టీజర్ విడుదలైంది. అభిమానులను దృష్టిలో ఉంచుకొని గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ పేరుతో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ టీజర్ను కట్ చేశారు. మహేష్ లుక్ తో పాటు సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ అన్న విషయాన్ని కూడా టీజర్ లో రివీల్ చేశారు. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేష్ లుక్స్, గ్రాఫిక్స్ తో టీజర్ అదిరిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వంద కోట్లకు పైగా బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.