7 సెకన్లలో 15 మీటర్ల గోడెక్కిన యువతి...వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

7 సెకన్లలో 15 మీటర్ల గోడెక్కిన యువతి…వీడియో వైరల్

October 23, 2019

15 అడుగులున్న గోడను కేవలం 7 సెకండ్స్‌లో ఎక్కి ఓ యువతి ఔరా అనిపించింది. ఇండోనేషియాకు చెందిన సుసంతి రహయాకు సాహసాలు చేయటం అంటే మక్కువ. వేగంగా గోడలను ఎక్కేయగలదు. 

తాజాగా 15 అడుగుల ఎత్తును 7 సెకన్ల కన్నా తక్కువ సమయంలోనే ఎక్కేసింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. ఈనెల 20న చైనాలోని క్సియామెన్‌లో నిర్వహించిన ఐఎస్ఎఫ్సీ క్లైంబింగ్ ప్రపంచకప్ పోటీలలో సుసంతి ఈ ఫీట్‌ను సాధించింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 60 లక్షల మందికిపైగానే వీక్షించారు. వారంతా ఈమెను స్పైడర్ ఉమెన్‌గా అభివర్ణిస్తున్నారు.