"Spiked Needle" Attacks On Women On The Rise In Spain
mictv telugu

ఇక్కడ బ్లేడు బాబ్జీలు.. అక్కడ సూది బాబ్జీలు.. మహిళలు విలవిల..

August 3, 2022

రద్దీగా ఉండే ప్రదేశాల్లో యువతులను, మహిళలను లైంగికంగా వేధించడమే వారి పని. సిరంజి సూదులతో గుచ్చుతూ రాక్షసానందం పొందుతున్నారు కొందరు దుండగులు. ఇలాంటి ఘటనలు ఇటీవ‌ల స్పెయిన్‌లో ఎక్కువ‌య్యాయి. ఈ మ‌ధ్య బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాల్లోనూ ఇలాంటి సంఘ‌ట‌న చోటుచేసుకున్నాయి. ర‌ద్దీగా ఉండే క్ల‌బ్బుల వ‌ద్ద జరుగుతున్న సూది దాడుల‌కు సంబంధించిన ఘ‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలోనూ షేర్ అవుతున్నాయి. క్ల‌బ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్తున్న మ‌హిళ‌ల‌పై మ‌త్తు ఉన్న సూది లేదా సిరంజీతో అటాక్ చేస్తారు. మ‌హిళ చేయి లేదా కాలుపై ఆ దాడి జ‌రుగుతుంది.

కానీ సూదులతో దాడి చేసిన మహిళల శరీరాల్లో ఎలాంటి మత్తు పదార్ధాలు లేవని డాక్టర్ల ద్వారా పరీక్షలు చేయించిన పోలీసులు చెబుతున్నారు. స్పెయిన్‌లోని క‌ట‌లోనియా ప్రాంతంలో ఇప్ప‌టి వ‌ర‌కు 23 కేసుల‌ను గుర్తించారు. బాధితులంతా యువతులే. వీరు పార్టీ చేసుకొంటున్న సమయంలో హఠాత్తుగా చేతిపై లేదా కాలిపై సూది గుచ్చినట్లు.. అనంతరం కొద్దిసేపు వీరికి మత్తుగా అనిపిస్తొన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇలాంటి దాడికి గురైనట్లు అనిపిస్తే వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లాలని  సూచిస్తున్నారు.