గంటకు 60 నిమిషాలు. నిమిషానికి 60 సెకన్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇదంతా ఇక చరిత్ర. ఇకపై కాలాల లెక్కలు మారిపోతాయి. భూమి తిరిగే వేగం అనూహ్యంగా పెరగడమే దీనికి కారణం. గతంలోకంటే భూమి ఒక సెకను వేగంగా తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
గత 50 ఏళ్ల కాలంలో భూమి తిరిగే వేగం పెరిగింది. ఫలితంగా 2020 సంవత్సరంలో 28 రోజులు త్వరగా ముగిశాయి.
ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్, బ్రిటన్‌లోని నేషనల్ ఫిజిక్స్ లేబొరేటరీ చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.
భూవేగం పెరగడంతో రోజుకు 0.05 మిల్లీసెకన్ల కాలం తగ్గిపోయింది. ఏడాదికి 19 మిల్లీ సెకన్లు తగ్గిపోయింది. పైకి ఇది ఏమాత్రం పట్టించుకోవాల్సిన విషయంగా కనిపిస్తున్నా.. ఆ సమయంలో భూమి వేల కిలోమీటర్లు తిరుగుతుంది. దీంతో లీప్ సెకన్ను తీసేసి లెక్కను సరిచేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయి.
సాధారణంగా ఒక సంవత్సరానికి 365 రోజులతోపాటు ఓ పావు రోజు ఉంటుంది. పావు రోజును లక్కించడం కష్టం కాబట్టి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరిలో ఓ రోజును కలిపి లీప్ సంవత్సరంగా పెట్టుకుంటున్నా.. లీప్ సెకన్ కూడా అలాంటిదే. భూమి వేగంలో తేడాల వల్ల లీప్ సెకన్ కలుపుతుంటారు. అయితే భూమి వేగం పెరగడంతో ఇకపై లీప్ సెకన్ అవసరం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది చాలా సమస్యలతో కూడుతున్న వ్యవహారం. సాఫ్ట్వేర్లు, జీపీఎస్ నెట్వర్క్ వంటి అనేక రంగాల్లో తేడాలు వస్తాయి. సౌరవ్యవస్థలో, భూవాతావరణంలో మార్పుల వల్ల భూవేగంలో తేడాలు వస్తుంటాయి.