Split in Andhra Pradesh kanna lakshminarayana somu virraju
mictv telugu

బీజేపీలో చిచ్చు.. వీర్రాజుకు చేతకావడం లేదన్న కన్నా..

October 19, 2022

ఒకపక్క వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన పోరుతో రసవత్తరంగా మారిన ఏపీ రాజీయాల్లోకి మరో కలకలం. రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో అసమ్మతి చిచ్చు రాజుకుంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిప్పులు చెరిగారు. పార్టీ నాయకత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కన్నా బీజేపీని వీడనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నాయకత్వాన్ని తిట్టి మరీ బయటి వెళ్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

బుధవారం కన్నా తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
‘‘కొందరికి పార్టీని నడపడం చేతకావడం లేదు. జనసేనను కలుపుకుపోయే విషయంలో నాయకత్వం చతికిలబడింది. ఇప్పటివరకు ఈ సంగతి బయటికి చెప్పలేదు. ఇక చెప్పక తప్పదు. రాష్ట్రంలో అసలు బీజేపీ ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు నెలలకోసారి కోర్ కమిటీ సమావేశం జరిగేది. అప్పుడు అన్ని నిర్ణయాలను సోము వీర్రాజే తీసుకుంటున్నారు’’ అని కన్నా అన్నారు.