అమ్మాయితోనే నా పెళ్ళి…ద్యుతి చంద్ సంచలన ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయితోనే నా పెళ్ళి…ద్యుతి చంద్ సంచలన ప్రకటన

May 20, 2019

Sprinter dyuti chand to marry a girl.

ప్రముఖ స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ తాను స్వలింగ సంపర్కురాలినని, ఓ అమ్మాయితో మూడేళ్లుగా బంధంలో ఉన్నానని చెప్పింది. తన గ్రామానికే చెందిన  ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. తమ మనసులు కలిశాయని, జీవితాంతం కలిసుంటామని.. ఈ సంవత్సరం ప్రపంచ అథ్లెటిక్స్‌ తరువాత ఇరు కుటుంబాల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటామని ఆమె మీడియాకు తెలిపింది. ఐతే ద్యుతి నిర్ణయాన్ని తాము వ్యతిరేకించడంతో కుటుంబంతో బంధం తెంచుకుందని ఆమె తల్లి అకుజి చంద్‌ తెలిపింది. ద్యుతి పెళ్లాడాలనుకుంటున్న అమ్మాయి తనకు మనవరాలు అవుతుందని, మనవరాలితో కూతురి వివాహం జరిపించడం ఎలా కుదురుతుందని ప్రశ్నించింది.