ఇదేం వింత బాబోయ్.. బొప్పాయి పండులో మొలకలు  - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం వింత బాబోయ్.. బొప్పాయి పండులో మొలకలు 

July 2, 2020

Sprouts in Papaya Fruit Peddapalli

కలియుగంలో వింతలు, విడ్డూరాలకు ఏ మాత్రం కొదవ లేదు. ప్రకృతికి భిన్నంగా ఏదో ఒక చోట ఆసక్తికర ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక జంతువు కడుపులో మరో జంతువు రూపాన్ని పోలి ఉన్నవి జన్మించడం, చెట్లు,పుట్టా.. ఇలా ఏదో ఒకదాంట్లో అంతు చిక్కని కథనాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా పెద్దపల్లి జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. బొప్పాయి పండులో గింజలు మొలకెత్తడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

సాధారణంగా బొప్పాయి పండులో గింజలు ఎప్పుడూ మొలకెత్తవు. కానీ సుల్తానాబాద్‌లో మాత్రం వింత సంఘటన చోటుచేసుకుంది. బొప్పాయి పండులో మొలకలు కనిపించాయి. స్వప్నకాలనీలో ఉండే సత్యనారాయణ అనే వ్యక్తి తన పెరిటిలోని బొబ్బాయి చెట్టుకు ఉన్న పండును తీసుకొచ్చాడు. పిల్లలు తినేందుకు దాన్ని కోసి చూడగానే విస్తుపోయాడు. ఆ పండులోపల గింజలు మొలకెత్తి మెల్లగా మొక్కగా మారుతుండటంతో ఆశ్చర్యపోయాడు. అందులో ఏకంగా మూడు మొలకలు కనిపించాయి. ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలియడంతో అంతా చూడాటానికి ఎగబడ్డారు. ఇంతకీ ఇది ఎలా జరిగిందని ఎవరికి అంతు పట్టడం లేదు. కొంతరైతే ప్రస్తుతం ఇలావి వింతలు సర్వసాధారణంగా మారిపోయాయని చెబుతున్నారు.