అదుర్స్ స్పైడర్ - MicTv.in - Telugu News
mictv telugu

అదుర్స్ స్పైడర్

August 10, 2017

ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘ స్పైడర్ ’ టీజర్ అదుర్స్ అంటున్నారు అతని ఫ్యాన్స్. మహేష్ ఫార్మల్ డ్రస్ లో లుక్ ఎక్సెలెంటుగా వుంది. ఈ సినిమాకు దర్శకుడు మురగదాస్ అవడం మొదటి నుండీ ఈ ప్రాజెక్ట్ మీద క్రేజ్ ను ఏర్పరిచింది. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్టవడం ఖాయమనే అంచనాలకు కూడా వచ్చాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమాకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ చెయ్యటం. అలాగే హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించడం మరొక ఎస్సెట్ ఈ సినిమాకు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్. వి. ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ తమిళ్ లో కూడా విడుదల కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, ఎస్. జె. సూర్యలు ఇందులో ప్రాముఖ్యమున్న పాత్రల్లో కన్పిస్తున్నారు. 27 సెప్టెంబర్ 2017 న విడుదలకు సిద్ధమౌతున్న స్పైడర్ కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ మెంటుగా ఎదురు చూస్తున్నారు.