sreeja konidela introduce a important person in her life.. insta post viral
mictv telugu

నా లైఫ్‌లో ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. శ్రీజ

January 3, 2023

sreeja konidela introduce a important person in her life.. insta post viral

మెగా డాటర్ శ్రీజ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను, పోస్టులను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటోంది. రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో గత కొంతకాలం దూరంగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని అందుకే ఇద్దరూ విడిగా ఉంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలపై ఏ మాత్రం స్పందించడం లేదు. తాజా పరిణామాలను కనుక చూస్తే నిజంగానే శ్రీజ, కళ్యాణ్ ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారని అనుమానం అందరిలోనూ కలుగుతుంది. కారణం వీరిద్దరూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎవరికీ వారే తమకు సంబంధించిన ఫోటోలను మాత్రమే షేర్ చేస్తున్నారు.

 

ఇదే క్రమంలో.. తాజాగా శ్రీజ ఓ పోస్ట్‌ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తూ అందరికీ ఆమె న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు. ‘‘డియర్‌ 2022.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కష్ట సుఖాల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకునే, అమితంగా ప్రేమించే, అన్ని విధాలుగా సంరక్షించే ఆ వ్యక్తి మరెవరో కాదు నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం మొదలైంది’’ అని ఆమె రాసుకొచ్చారు. #SelfConnection, #Innerpeace అనే ట్యాగ్‌లను ఆమె జత చేశారు. ఆమె పెట్టిన ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.