నటుడు శ్రీకాంత్ ఇంట్లో విషాదం  - MicTv.in - Telugu News
mictv telugu

నటుడు శ్రీకాంత్ ఇంట్లో విషాదం 

February 17, 2020

dxxdhb

తెలుగు నటుడు శ్రీకాంత్ ఇంట్ల విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన తండ్రి మేకా పరమేశ్వరరావు నిన్న(ఆదివారం) రాత్రి అనారోగ్యంతో చనిపోయారు. 70 ఏళ్ల పరమేశ్వరరావు కొన్నేళ్లు శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 4 నెలల నుంచి హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు భార్య ఝాన్సీ, కూతురు నిర్మిల, శ్రీకాంత్ తోపాటు అనిల్ అనే కొడుకు ఉన్నారు. ఆయన మృతివార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికెళ్లి భౌతికకాయాలనికి నివాళి అర్పిస్తునారు. ఈ రోజు మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.  కృష్ణాజిల్లాకు చెంది పరమేశ్వరరావు కుటుంబం తర్వాత కర్ణాటకు వలస వెళ్లింది. శ్రీకాంత్ అక్కడే పుట్టాడు.