శ్రీశాంత్ కు సినిమాలు కలిసొస్తాయా ? - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీశాంత్ కు సినిమాలు కలిసొస్తాయా ?

July 7, 2017


మాజీ వివాదాల మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా తెలుగు, తమిళ్, మళయాళం మూడు భాషల్లో వస్తున్న ‘ టీమ్ 5 ’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పట్నించో శ్రీశాంత్ ఇగ హీరోగా వస్తాడు.. అగ హీరోగా వస్తాడు.. అని ఊరించి ఊరించి చివరికి ఈ సినిమాతో వస్తున్నాడు. మహేష్ భట్ డైరెక్షన్ లో హిందీలో డెబ్యూ అనుకున్నా అక్కడేం వివాదాన్ని మూఠ కట్టుకున్నాడో గానీ అది పట్టాలెక్కకుండానే తుస్సుమన్నది. ఆ తర్వాత తెలుగులో సానా యాదిరెడ్డి దర్శకత్వంలో సినిమా అని ఆ మధ్య బాగానే పబ్లిసిటీ కూడా జరిగింది. కారణాలేంటో గానీ ఆ ప్రాజెక్టు కూడా డ్రాపైంది. ఇంక అందరూ శ్రీశాంత్ ను మరిచినట్టే అనుకుంటున్న టైంలో ‘ టీమ్ 5 ’ అనే సినిమాతో ఒక్కసారిగా షాకింగ్ న్యూసే ఇచ్చాడు. మొత్తానికి తను ఆటగాడి నుండి సినిమా హీరో కావాలనే కలను ఖచ్చితంగా నిజం చేస్కుటున్నట్టే వుంది.

చూడాలి మరి శ్రీశాంత్ ఫీల్డ్ మారి, ముఖానికి రంగేస్కొని, మైదానాన్ని వదిలి రంగస్థలం పైకి వచ్చి నిలదొక్కుకుంటాడో ? లేదో ?? ఎందుకంటే ఇక్కడ కూడా ఏమైనా ఫిక్సింగ్ లకు పాల్పడితే ఎలా అని చాలా మంది దర్శక నిర్మాతలు అతనితో సినిమా అంటే కాస్త వెనకా ముందు ఆలోచిస్తున్నారట ! ?