బుట్టబొమ్మకు మరోసారి స్టెప్పులేసిన వార్నర్ - MicTv.in - Telugu News
mictv telugu

బుట్టబొమ్మకు మరోసారి స్టెప్పులేసిన వార్నర్

October 31, 2020

telugu

లాక్‌డౌన్ సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు పాటలకు టిక్‌టాక్ వీడియోలు రూపొందించిన సంగతి తెల్సిందే. ‘మైండ్ బ్లాక్’, ‘పక్కా లోకల్’, ‘ముక్కలా మూకాబుల’, ‘రాములో రాముల’, ‘బుట్ట బొమ్మ’ ఇలా ఎన్నో హిట్ పాటలకు వార్నర్ స్టెప్పులేశాడు. 

వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి వార్నర్ ‘బుట్టబొమ్మ’ పాటకు డాన్స్ చేసాడు. ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెల్సిందే. మ్యాచ్ మధ్యలో విరామ సమయంలో వార్నర్ బుట్ట బొమ్మ సాంగ్‌కు డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.