డ్రగ్స్‌ కేసులో శ్రీలంక క్రికెటర్ అరెస్ట్! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్‌ కేసులో శ్రీలంక క్రికెటర్ అరెస్ట్!

May 25, 2020

డ్రగ్స్‌ కేసులో శ్రీలంక క్రికెటర్ షెహన్ మధుశంక కటకటాలపాలయ్యాడు. మధుశంక స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. ఆ సమయంలో మధుశంక వద్ద 2 గ్రాముల హెరాయిన్ డ్రగ్ లభించింది. 

దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం మెజిస్ట్రేట్ రెండు వారాల కస్టడీకి ఆదేశించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా షెహన్ మధుశంకపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన మధుశంక తోలి మ్యాచ్ నుంచే ఆకట్టుకున్నాడు. అయితే, 2018లో గాయం కావడంతో అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమయ్యాడు.