Sri Lanka did not listen to India.. there is a reason!
mictv telugu

భారత్ మాట వినని శ్రీలంక..కారణాలివే!

August 16, 2022

Sri Lanka did not listen to India.. there is a reason!

చైనా దేశానికి చెందిన హంబన్‌తోటా నౌకాశ్రయ విషయంలో భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ ఎంత చెప్పినా వినకుండా చివరి నిమిషంలో శ్రీలంక అధికారులు అనుమతులు ఇవ్వడంతో..చైనా నిఘా ‘యువాన్ వాంగ్-5’ ఈరోజు ఉదయం 8.30 సమయంలో హంబటౌట రేవుకు చేరుకొంది. ఈ నౌక రాకను పసిగట్టిన భారత్..తక్షణమే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది.

భారత్ అభ్యంతరాలపై స్పందించిన శ్రీలంక అధికారులు..యువాన్ వాంగ్-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనా అధికారులను కోరామని, చైనా అధికారులు తమ ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు ఓ ప్రచారం జరిగింది. కానీ, గతవారం నుంచి యువాన్ వాంగ్ హంబటౌట దిశగా 1000 కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు భారత్ అధికారులు గుర్తించారు. మరోసారి ఈ విషయాన్ని శ్రీలంక అధికారులకు తెలియజేశారు.

అయితే, ఈసారి నౌక ప్రయాణాన్ని ఎందుకు వాయిదా వేయాలి? అని చైనా అధికారులు శ్రీలంక అధికారులను నిలదీశారు. దానికి వారి దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో నౌకకు శ్రీలంక అనుమతి మంజూరు చేసింది. దానికి ఓ కారణం ఉంది…హంబటౌట అభివృద్ధికి చైనా 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చింది. శ్రీలంక ఆ రుణం చెల్లించలేకపోవడంతో ఈ పోర్టును 99 సంవత్సరాల లీజుకు బీజింగ్ తీసుకొంది.

ఈ విషయంపై శ్రీలంక విదేశాంగశాఖ స్పందిస్తూ.. ”ఆగస్టు 16-22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే ఈ నౌకకు అనుమతి ఇచ్చాం. ‘యవాన్ వాంగ్-5 విషయంలో మా పొరుగు దేశాలకు భద్రత, సహకారానికి మేము అత్యున్నత ప్రాధాన్యతను ఇస్తాం. ప్రతిదేశం సార్వభౌమత్వం సమానమే అనే సూత్రానికి అనుగుణంగా అన్ని పక్షాల ప్రయోజనాలు, ఆందోళనను పరిగణనలోకి తీసుకొంటాము” అని పేర్కొంది.

ఈ నౌక విషయంలో భారత్ ఆందోళన చెందడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి జరగకుండా ఉండడానికి గతకొన్ని రోజులుగా శ్రీలంక అధికారులతో భారతదేశ అధికారులు చర్చలు జరిపాయి. అయినప్పటికి భారత్ మాట వినకుండా శ్రీలంక చైనా నౌకకు అనుమతులు ఇచ్చింది.

భారత్‌ ఆందోళన చెందడానికి 5 కారణాలు..

చైనా.. యాంగ్‌ వాంగ్‌ 5 నిఘా నౌక సెన్సార్లు కలిగి ఉంది. భారత్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌ను ప్రయోగిస్తే వాటిని ట్రాక్‌ చేయగలదు. ఈ మిసైల్స్‌ను భారత్‌ ఒడిశాలోని అబ్దుల్‌ కలామ్‌ ఐలాండ్‍ నుంచి ప్రయోగిస్తుంటుంది. యాంగ్‌ వాంగ్‌ 5లోని అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించికొని చైనా.. భారత క్షిపణుల పరిధి, ఖచ్చితత్వాన్ని అంచనా వేయగలగుతుంది.

దీంతో మన క్షిపణుల వివరాలు డ్రాగన్‌ చేతికి చిక్కినట్లవుతుంది. ఆ నౌక ఆగస్టు 22 వరకు శ్రీలంకలోనే ఉండనుంది. యాంగ్‌ వాంగ్‌ 5 సముద్రంలో సర్వేలు నిర్వహించగలదు. దాంతో హిందూ మహా సముద్రంలో సబ్‌మెరైన్‌ కార్యకలాపాలు సాగించేందుకు వీలు కలగనుంది. 2021లో చైనాకు చెందిన సర్వే నౌక షియాంగ్‌ యాంగ్‌ హంగ్‌ 03 ఇలాంటి సర్వేలే నిర్వహించింది.