Sri Lanka has accepted Adani's investments
mictv telugu

అదానీ పెట్టుబడులకు శ్రీలంక ఓకే.. ఫలించిన మోదీ ఒత్తిడి?

February 24, 2023

Sri Lanka has accepted Adani's investments

హిండెన్ బర్గ్ నివేదికతో కుప్పకూలిన అదానీకి శ్రీలంక ప్రభుత్వం ఊరట కలిగించింది. లంకలో 442 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీకి అనుమతించింది. మన్నార్ ప్రాంతంలో250 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు, పూనెరిన్‌లో 100 మెగావాట్ల మరో ప్లాంట్‌కి అదానీ గతంలో దరఖాస్తు చేసుకుంది. దీన్ని తాజాగా శ్రీలంక బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ గురువారం ఆమోదిస్తూ లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ చేసింది.

మొత్తం 350 మెగావాట్లు కలిగిన ఈ రెండు ప్రాజెక్టులను 2025 వరకు పూర్తి చేసి ఆ దేశ నేషనల్ గ్రిడ్‌కి అనుసంధానించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుతో స్థానికంగా 1500 నుంచి 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. కాగా గతేడాది జూన్‌లో ఈ ప్రాజెక్టులను అదానీకే అప్పగించాలని ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సేపై ఒత్తిడి తెచ్చారని ఓ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన మూడ్రోజులకే సదరు అధికారి తన పదవి నుంచి తప్పుకున్నారు. దీనిపై రెండు దేశాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మోదీ అదానీకి సంపదను కట్టబెడుతున్నారని విపక్షాలు ఆరోపించాయి.