ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక రెండో వన్డేకు సిద్ధమయ్యాయి. మరోసారి టెస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మొదటి వన్డే ఆడిన టీమ్‌లో ఒక మార్పుతో భారత్ బరిలోకి దిగుతుంది. స్పిన్నర్ చాహల్ స్థానంలో కుల్దీప్ కు అవకాశం కల్పించారు. శ్రీలంక కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మధుశంక, నిస్సాంక జట్టుకు దూరమయ్చారు. వారి స్థానంలో ఫెర్నాండో, లహిరు కుమార వచ్చారు.మొదటి వన్డేలో గెలిచిన ఊపులో ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుంది.
గౌహతితో పోలిస్తే కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ఈ బౌన్సీ ట్రాక్‌పై రోహిత్ శర్మకు అద్బుతమైన రికార్డు ఉంది.ఇదే మైదానంలో రోహిత వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో సెంచరీ, టీ20ల్లో సెంచరీలు సాధించాడు. ఇక్కడే 173 బంతుల్లో 264 పరుగులు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు…విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఓ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. ఈ జోడీ.. కోల్‌కతాలో కనీసం 31 పరుగులు చేస్తే అరుదైన మైలురాయిని చేరుకుంటుంది. వీళ్లిద్దరూ ఇప్పటి వరకు 84 భాగస్వామ్యాలు ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 4969 పరుగులు చేశారు. ఇప్పుడు మరో 31 పరుగులు చేస్తే.. భారత్ తరఫున 5000 పరుగులు చేసిన మూడో భారత జోడీగా అరుదైన రికార్డు సృష్టిస్తారు.