ఆదానీకి ఇవ్వాలని శ్రీలంక అధ్యక్షుడిపై మోదీ ఒత్తిడి అంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆదానీకి ఇవ్వాలని శ్రీలంక అధ్యక్షుడిపై మోదీ ఒత్తిడి అంటూ..

June 13, 2022

అంబానీ, అదానీలకు మోదీ ప్రభుత్వం దోచి పెడుతోందని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. తాజాగా ఆరోపణలు శ్రీలంకలోనూ వినిపిస్తున్నాయి. అదానీలకు ప్రయోజనం చేకూర్చి పెట్టడానికి శ్రీలంక అధ్యక్షుడిపై మోదీ తీవ్ర ఒత్తిడి తెచ్చారంటూ ఆ దేశ విద్యుత్ శాఖ అత్యున్నత అధికారి వెల్లడించారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.
శ్రీలంకలో 500 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి నడిపే కాంట్రాక్టును గౌతమ్ ఆదానీకి కట్టబెట్టారు. ఆదానీకే ఆ కాంట్రాక్టు ఇవ్వాలంటూ మోద శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్షపై ఒత్తిడి తెచ్చారని శ్రీలంక విద్యుత్ శాఖ చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో పార్లమెంటరీ కమిటీకి ముందు ఆదివారం చెప్పాడు. తర్వాత మాట మార్చి అది నిజం కాదని, ఏదో ఉద్వేగంలో అలా అన్నానని, విచారణలో తికమక పడ్డానంటూ వెనక్కి తగ్గాడు. ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా కూడా చేశారు. వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే ఈ ప్రాజెక్టు కేటాయింపులో గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు రావడంతో పార్లమెంటరీ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణలను రాజపక్ష కొట్టి పడేశారు.