పాక్‌లో క్రికెట్ ఆడలేం బాబోయ్.. శ్రీలంక ఆటగాళ్ల వాదన - MicTv.in - Telugu News
mictv telugu

పాక్‌లో క్రికెట్ ఆడలేం బాబోయ్.. శ్రీలంక ఆటగాళ్ల వాదన

September 10, 2019

Sri Lanka..

పాకిస్తాన్‌కు శ్రీలంక ఆటగాళ్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు విముఖత వ్యక్తం చేశారు. భద్రత కారణాల దష్ట్యా తాము పాక్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు మలింగ, మాథ్యూస్, తిసారా పెరీరా తేల్చి చెప్పారు. వీరి బాటలోనే మిగితా ఆటగాళ్లు కూడా సిరీస్ పై వెనక్కి తగ్గారు. పాకిస్తాన్ టూర్‌ కోసం ఈ నెల 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ 20 లు ఆడేందుకు శ్రీలంక బోర్డు నిర్ణయించింది. అయితే ఈ పర్యటన తమకు ఇష్టం లేదని ఆటగాళ్లు బోర్డుకు తేల్చి చెప్పారు. దీంతో వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

కాగా 2009లో పాకిస్తాన్‌లో క్రికెట్ సిరీస్ ఆడేందుకు లంక ఆటగాళ్లు వెళ్లారు. అప్పుడు వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే ఆ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. దీంతో అప్పటి నుంచి అక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఏ దేశం ముందుకు రాలేదు. చాలా కాలం తర్వాత ఆ దేశం ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. అయినప్పటికీ లంక క్రికెటర్లు మాత్రం ఆనాటి చేదు అనుభవాన్ని మర్చిపోలేదు. తాము ఆడేదే లేదంటూ తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.