Sri Lanka scored 206 runs in the second T20 against Team India
mictv telugu

బౌలర్ల విఫలం.. భారీ స్కోర్ చేసిన శ్రీలంక

January 5, 2023

పుణె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడ్డ సంజూ శాంసన్ స్థానంలో కొత్తగా రాహుల్ త్రిపాఠి వచ్చాడు. ఇతనికి ఇదే తొలి ఆరంగ్రేటం. మొదటి మ్యాచులో ధారాళంగా పరుగులు ఇచ్చిన హర్షల్ పటేల్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. బౌలర్లు విఫలమవడంతో లంక భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. కుసాల్ మెండిస్ (52), దసున్ శనక (56) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. నిస్సాంక (33), అసలంక (37) తమ వంతు కృషితో భారీ స్కోర్ అందించారు. భారత బౌలర్లలో శివమ్ మావి (4 ఓవర్లలో 53 పరుగులు), అర్షదీప్ సింగ్ (2 ఓవర్లలో 37 పరుగులు) చేతికి ఎముక లేకండా దానంగా ఇచ్చేశారు. ఉమ్రాన్ మాలిక్ (4 ఓవర్లలో 48 పరుగులు) ఇచ్చినా మూడు వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. చాహల్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.