ఏపీకి శ్రీలంక పరిస్థితి ఖాయం: ఎన్. కె. సింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి శ్రీలంక పరిస్థితి ఖాయం: ఎన్. కె. సింగ్

April 21, 2022

5

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. జగన్ అప్పులు మీద అప్పులు చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మారుస్తున్నారని, తన పరిపాలన కారణంగా ఏపీకి శ్రీలంక పరిస్థితి కచ్చితంగా వస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. మూడేళ్లు గడవక ముందే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా అంచులకు ఈడ్చుకుపోయారని ధ్వజమెత్తున్నారు. తనను నమ్మి ఓట్లు వేసి, రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడుపుతాడని ఆశతో అధికారాన్ని అప్పగిస్తే, ప్రజలకు భవిష్యత్తే లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

‘కాగ్’ లోగడే తెలిపిన వివరాల ప్రకారం.. ”మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రంపై మొత్తం చెల్లింపుల భారాన్ని రూ.1.76 లక్షల కోట్లకు చేర్చారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సుమారు 70 శాతం బరువు ఏపీ ఆర్థిక సంక్షోభ తీవ్రతపై పడింది. 204, 205 రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘించి, శాసనసభను దారి తప్పించి, నిధుల వ్యయంలో విశృంఖలంగా వ్యవహరిస్తోంది. ఏపీ సర్కారు పరిమితికి మించి అప్పులు చేసింది” అని పేర్కొంది. అయితే ఇదే విషయాన్ని నాలుగు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంటులో వివరాలను వెల్లడిస్తూ, హెచ్చరించింది.

మరోపక్క పదిహేనోవ ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎన్. కె. సింగ్ తాజగా హెచ్చరిస్తూ.. ‘ప్రజల కళ్లకు గంతలు కట్టడానికి విఫలయత్నాలు చేస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు దోహదపడని పనులు చేస్తున్నారు. దీంతో తీవ్ర అనర్ధాలు తప్పవు. ఇది ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్ధిక సంక్షోభం తప్పదు. చేసిన అప్పులు తీర్చేందుకు మళ్ళీ ఎవరో ఒకరి దగ్గర చేతులు చాచాల్సిన పరిస్థితి జగన్ ప్రభుత్వానికి వస్తుంది. ప్రజలకు లబ్ధి చేకూర్చే ఉపాధి అవకాశాలను తన రాజకీయ ప్రయోజనాలకు పణంగా పెడుతున్నారు’ అని అన్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే కచ్చితంగా ఏపీకి శ్రీలంక పరిస్థితి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.