ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న భారత్ – శ్రీలంక రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ఆలౌటైంది. 39.4 ఓవర్లలో 215 పరుగులు చేసి మొత్తం వికెట్లను కోల్పోయింది. నువానిడు ఫెర్నాండో అర్ధ సెంచరీ చేయగా, మెండిస్ 34, హసరంగా 21, వెల్లాల్గే 32, అవిష్క ఫెర్నాండో 20 పరుగులు చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో కం కెప్టెన్ దసున్ శనక కేవలం 2 పరుగులే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగులో బౌల్డయ్యాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. భారత లక్ష్యం 216 పరుగులు కాగా, బ్యాటర్ల ఫాం చూస్తుంటే టార్గెట్ చాలా ఈజీగా రీచ్ అయి మ్యాచ్ గెలిచే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. మొదటి వన్డేలో భారత్ విజయం సాధించగా, ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలవాలని రోహిత్ సేన భావిస్తోంది.