క్రికెటర్‌ కుశాల్‌ మెండిస్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెటర్‌ కుశాల్‌ మెండిస్ అరెస్ట్

July 5, 2020

jngh

శ్రీలంక వికెట్ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ కారు ఈరోజు ఉదయం కొలంబో శివారులోని పనాదుర వద్ద అదుపుతప్పి ఓ వృద్ధుడ్ని ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆ వృద్ధుడు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుశాల్‌ కారుని మితిమీరిన వేగంతో నడిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పోలీసులు మెండిస్ ను అరెస్టు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. కుశాల్‌ ఇప్పటివరకు శ్రీలంక తరపున 76 వన్డేల్లో 2,167 పరుగులు, 44 టెస్టుల్లో 2,995 పరుగులు, 26 టీ20ల్లో 484 పరుగులు సాధించాడు.