Sri Lankan cricketer Police arrested from Sydney
mictv telugu

ఆస్ట్రేలియాలో శ్రీలంక క్రికెటర్ అరెస్ట్..

November 6, 2022

Sri Lankan cricketer Police arrested from Sydney

శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక చిక్కుల్లో పడ్డాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అతడిని అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసారు. 29 ఏళ్ళ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుణతిలకను సిడ్నీ సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ డేటింగ్ యాప్ ద్వారా తనను వేధించినట్టు మహిళ గుణతిలకపై ఫిర్యాదు చేసింది. గుణతిలకను అదుపులోకి తీసుకున్న విషయాన్ని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తమ వెబ్ సైట్‌లో తెలిపారు. అయితే శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు తప్ప గుణతిలక పేరును వెల్లడించలేదు.

టీ 20 వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్ చేతిలో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎడమచేతి వాటం బ్యాటర్ గుణతిలక ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్ మ్యాచ్‌లో నమీబియాపై బరిలోకి దిగి డకౌటయ్యాడు. తర్వాత జట్టు సూపర్ 12 స్టేజ్‌కి అర్హత సాధించినప్పటికీ అతను గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.