Sri Lankan military personnel guard Prime Minister's chair in Colombo office
mictv telugu

కుర్చీ’కి కాపలా కాస్తున్న సైనికులు.. ఎందుకంటే..

July 14, 2022

ప్ర‌ధాని కుర్చీకి కాప‌లా కాస్తున్నారు శ్రీలంక సైనికులు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక‌లో రోజుకో దృశ్యం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. సంక్షోభాన్ని నివారించ‌లేని ప్ర‌భుత్వాధినేత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వీధుల్లోకి వ‌చ్చేస్తున్న లంక ప్ర‌జ‌లు ఆ దేశ అధ్య‌క్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స అధికార నివాసాన్ని ఆక్ర‌మించే య‌త్నం చేసిన దృశ్యాలు క‌ల‌క‌లం రేపాయి. జ‌నం ఆ భ‌వ‌నంలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి చాలా ముందుగానే గొట‌బ‌య దేశం వ‌దిలి ప‌రార‌య్యారు. ఇక ప్ర‌ధానిగా కొన‌సాగుతున్న ర‌ణిల్ విక్ర‌మ సింఘే కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఈ క్ర‌మంలో అధ్య‌క్షుడి భ‌వ‌నం మాదిరే ప్ర‌ధాని మంత్రిత్వ కార్యాల‌యాన్ని కూడా జ‌నం ఎక్క‌డ ముట్ట‌డించి అందులోకి చొర‌బ‌డ‌తారోన‌న్న ఆందోళ‌న‌తో ఆ దేశ సైన్యం అప్ర‌మ‌త్త‌మైంది. పీఎంఓ భ‌వ‌నాన్ని త‌మ అధీనంలోకి తీసుకున్న లంక సైన్యం… ప్ర‌ధాని కార్యాల‌యంలో ప్ర‌ధాని కూర్చునే కుర్చీ చుట్టూ సైనికుల‌ను మోహ‌రించ‌డం విశేషం.