Sri Lankan players mock Bangladesh with Nagin dance
mictv telugu

పగ తీర్చుకున్న ఆటగాడు..నాగిని డ్యాన్స్​ వైరల్

September 2, 2022

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆసియా కప్ మ్యాచ్‌లు ప్రారంభమౌతాయని వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు గతనెలలో ఆసియా కప్‌ మ్యాచ్‌లు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. మొదటి మ్యాచ్ నుంచి గతరాత్రి జరిగిన మ్యాచ్ వరకు అభిమానుల అంచనాలను తారుమారు చేస్తూ, ఆయా దేశాల యువ ఆటగాళ్లు చేలరేగి ఆడుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

 

శ్రీలంక దేశానికి చెందిన ఆటగాడు చమిక కరుణరత్నే వేసిన నాగిన్ డ్యాన్స్ వైరల్‌గా మారింది. మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు చేసిన నాగిని డ్యాన్స్ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అంతేకాదు, గతరాత్రి విజయంతో శ్రీలంక జట్టు సూపర్ 4 దశకు చేరుకుంది.

వివరాల్లోకి వెళ్తే..గ్రూప్-బిలో భాగంగా గురువారం రాత్రి ఉత్కంఠ బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య ఉత్కంఠ మ్యచ్ జరిగింది. చివరికి బంగ్లాదేశ్‌ను ఓడించి శ్రీలంక విజయఢంకా మోగించింది. దాంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ జట్టు ఇంటిదారి పట్టింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ఆటగాడు చమిక కరుణరత్నే నాగిని డ్యాన్స్‌ చేశాడు. నాగిని డ్యాన్స్ చేస్తూ, బంగ్లాదేశ్‌ను రుణరత్నే ఎద్దేవా చేశాడు.

ఎందుకంటే కొన్నేళ్లుగా బంగ్లా ఆటగాళ్లు, అభిమానులు నాగిని డ్యాన్స్‌తో తమ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, ఇది వాళ్ల విజయానందం కంటే అవతలి జట్లను ఎద్దేవా చేసినట్లు ఉంటుంది. దాంతో, లంక ఆటగాడు కరుణరత్నే బంగ్లాదేశ్ శైలిలోనే ఆ జట్టుపై పగ తీర్చుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది.