లంకారాజ్యం.. తమ్ముడు అధ్యక్షుడు.. అన్న ప్రధాని..  - MicTv.in - Telugu News
mictv telugu

లంకారాజ్యం.. తమ్ముడు అధ్యక్షుడు.. అన్న ప్రధాని.. 

November 20, 2019

Sri Lanka.

ఎక్కడైనా అంతే. ఇంట్లో అయినా, గల్లీలో అయినా, ఢిల్లీలో అయినా… మెజారిటీ ఉంటే ఇష్టారాజ్యమే మరి. తాము ఆడిందే ఆట, పాడిందే పాట. లంకారాజ్యంలో అదే జరిగింది. ఒకే ఇంట్లో తమ్ముడు దేశానికి అధ్యక్షుడు అయ్యాడు.. అన్నయ్య ప్రధాని పదవిని అందుకున్నాడు.  డబుల్ ధమాకా అంటే ఇదే. శ్రీలంక 7వ అధ్యక్షుడిగా గొటబయ రాజపక్ష ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే తన అన్నను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాడు. దీంతో అక్కడి రాజకీయాలు సంచలనంగా మారాయి.   

శ్రీలంక ప్రధానమంత్రిగా తన అన్న మహింద రాజపక్షను నియమిస్తూ అధ్యక్షుడు గొటబయ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రధాని పదవికి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు. దీంతో మహిందకు ప్రధాని పీఠం దక్కింది.  విక్రమసింఘే గురువారం అధికారికంగా పదవి నుంచి దిగిపోనుండడంతో రేపటి నుంచి మహింద బాధ్యతలు చేపట్టనున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. 2005 నుంచి 2015 వరకు పదేళ్లు శ్రీలంక అధ్యక్షుడిగా కొనసాగిన మహింద.. రెండు రోజుల క్రితం తన తమ్ముడి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడు అన్న ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి తమ్ముడు వస్తాడని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.