భద్రాద్రి రామయ్య పెళ్లి.. 300 ఏళ్లలో తొలిసారి ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

భద్రాద్రి రామయ్య పెళ్లి.. 300 ఏళ్లలో తొలిసారి ఇలా

April 2, 2020

Sri Rama Navami At Bhadrachalam

శ్రీరామ నవమి వేడుకలు భద్రాద్రిలో సాధాసీదాగా జరుగుతున్నాయి. లాక్‌డౌన్  కారణంగా భక్తులు లేకుండా ఆలయ అర్చకుల సమక్ష్యంలో రాములోరి పట్టాభిషేకం, కల్యాణం కార్యక్రమాలు జరిపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిస్తునందున భక్తులకు ఈసారి స్వామివారి వేడుక కనులారా చూసుకునే భాగ్యంలేకుండా పోయింది. గత మూడున్నర శతాబ్దాల చరిత్రలో ఏనాడూ ఇలా మహాపట్టాభిషేకం కార్యక్రమాలు జరగలేదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. 

భద్రాద్రిలోని నిత్య కల్యాణ మండపం వద్ద ప్రతి ఏటా స్వామివారికి కల్యాణం నిర్వహిస్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను చూసి పులకించిపోతారు. ప్రభుత్వం తరుపున లాంఛనంగా వధూవరులకు పట్టువస్త్రాలు, తలంబ్రాలను ఘనంగా తీసుకువచ్చి సమర్పిస్తారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కల్యాణ మండపం, పూల అలంకరణ చేసి దేదివ్యమానంగా ఆలయాన్ని ముస్తాంబు చేస్తారు. వారం రోజుల ముందు నుంచే అక్కడ సందడి మొదలయ్యేది. కానీ ఈసారి మాత్రం 300 సంవత్సరాల కాలంలో ఎన్నడూ జరగని విధంగా సాధాసీదాగా ఈ వేడుక చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2015, 2016 సంవత్సరాల్లో స్వయంగా సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసారి దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.