అఘోరాగా మారిపోయిన శ్రీరెడ్డి.. - MicTv.in - Telugu News
mictv telugu

అఘోరాగా మారిపోయిన శ్రీరెడ్డి..

February 21, 2020

fbvgcbh

ఏదో ఒక అంశంతో తరుచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది నటి శ్రీ రెడ్డి. ప్రతిసారి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసి తనకంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంది. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వీడియో పోస్ట్ చేసే ఆమె ఈసారి సరికొత్త గెటప్‌తో కనిపించింది. తన ఫేస్‌బుక్, టిక్ టాక్ ఫాలోవర్ల కోసం పూర్తిగా అఘోరా వేషాధారణలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

శివరాత్రి సందర్భంగా తన అభిమానుల కోసం ఆమె ఇలా చేసింది. ఒంటి నిండా బూడిద పూసుకొని, మెడలో భారీగా రుద్రాక్ష మాలలు ధరించింది. ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో కర్ర పట్టుకుని శివతాండవం చేసింది. తలకు పెద్ద బొట్టుతో నిజంగా అఘోరాను తలపించేలా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి స్టెప్పులు వేసింది. ఇదంతా బాగానే ఉన్నా ఆమెను మరో వివాదం చుట్టుముట్టింది. తనకు భక్తి ఎక్కువగా ఉందని చెప్పుకునే ఆమె చెప్పులు వేసుకొని అఘోర వేషంలో ఎలా డ్యాన్స్ చేస్తుందని మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఇది చూసిన ఆమె ఫాన్స్ మాత్రం వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు.