అడల్ట్ కంటెంట్‌తో సంచలన వ్యాఖ్యలు చేస్తూ..తరచూ వార్తల్లో నిలిచే నటి శ్రీ రెడ్డి..మరోసారి అలాంటి వ్యాఖ్యలనే చేసింది. ఈ సారి దగ్గుబాటి అభిరామ్‌ను టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోని అమ్మేస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ స్థలాన్ని కొన్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్లాట్లు కడుతుందని చెబుతున్నారు. దీంతో రామానాయుడు స్టూడియోతో కనెక్టైన వారు కొంచెం ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. ఎన్నో సినిమాల షూటింగ్‌లకు వేదికైనా రామానాయుడు స్టూడియో ఇక కనిపించదన్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరెడ్డి శ్రీ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. అభిరామ్‌కు ఫస్ట్ నైట్ జరిగిన ఈ ప్లేస్ ఇక ఉండబోవట్లేదు అని వ్యాఖ్యానించింది.
శ్రీ రెడ్డి కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆమెపై వ్యాఖ్యలను కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నచ్చినట్లు మాట్లాడొద్దంటూ హెచ్చరిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆమెకు సపోర్ట్ ఇవ్వడం గమనార్హం. కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం అంటూ శ్రీ రెడ్డి చేసిన హడావుడి సమయంలో అభిరామ్‌పై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తనను వాడుకున్నాడంటూ క్లోజ్ ఉన్న ఫోటోలను, వాట్సాప్ చాట్ బయట పెట్టి హల్చల్ చేసింది.