శ్రీరెడ్డి, రవిప్రకాశ్ ఫేక్ చాట్.. టీవీ9 ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డి, రవిప్రకాశ్ ఫేక్ చాట్.. టీవీ9 ఫిర్యాదు

April 11, 2018

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై నిరసన తెలుపుతున్న నటి శ్రీరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో నకిలీ చాటింగ్ వివరాలను సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. శ్రీరెడ్డికి, టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌కు మధ్య వాట్సాప్ చాట్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లను గుడ్ల శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి ప్రచారం చేస్తున్నాడని ఆ టీవీ చానల్.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

శ్రీరెడ్డి టీవీ9లో ఉద్యోగం అడగ్గా, రవిప్రకాశ్ గెస్ట్ హౌస్‌కు రమ్మన్నారని, ఆమె ఫోటోలు పంపమన్నారని చాటింగ్‌లో ఉంది.  అయితే ఇదంతా నకిలీ చాటింగ్ అని శ్రీరెడ్డి కూడా పేర్కొంది. శ్రీరెడ్డి వివాదాన్ని సాకుగా చేసుకుని కొందరిని టార్గెట్ చేసుకోవడానికి ఆమె ఫొటోలతో నకిలీ చాట్ చేస్తున్నట్లు టీవీ9 తన ఫిర్యాదులో పేర్కొంది.

శ్రీరెడ్డి సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమె ఫొటోలను తీసుకుని మార్ఫింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం నేరమని, మూడేళ్ల జైలు శిక్షపడే అవకాశముందని పోలీసులు మెచ్చరిస్తున్నారు. కాగా ఈ చాట్ ను తాను సృష్టించలేదని, వెంకటగిరి వైఎస్సార్ సీపీ అనే ఫేస్‌బుక్ ఖాతా నుంచి షేర్ చేసుకున్నానని  శివకుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు.