శ్రీరెడ్డిని ఇల్లు ఖాళీ చేయమన్న యజమాని - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డిని ఇల్లు ఖాళీ చేయమన్న యజమాని

April 9, 2018

తెలుగు సినీపరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన గళమెత్తిన శ్రీరెడ్డిపై వేధింపులు పెరుగుతున్నాయి. అర్ధనగ్న ప్రదర్శన చేసిందుకు ఆమెపై పలువురు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కట్టడి చేయడానికి పావులు కదుపుతున్నారు. ఆమెకు నిలుచోడానికి నీడ లేకుండా చేయడానికి వేధింపులకు పాల్పడుతున్నారు.

శ్రీరెడ్డి నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయాలని యజమాని చెప్పాడట. ఈ విషయాన్ని శ్రీరెడ్డి తెలిపింది. ‘‘ఐదేళ్లగా నేను ఒకే ఇంట్లో ఉంటున్నా. ఇప్పటి వరకూ యజమాని కుటుంతో ఎలాంటి ఇబ్బంది లేదు. శనివారం జరిగిన ఘటన వల్ల వారికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.

ఇంటి యజమాని ఐ.ఎ.ఎస్‌ అధికారి. అయినా ఆయన భయపడి నన్ను ఇల్లు ఖాళీ చెయ్యమంటున్నారు. సంకుచిత మనుషులు.. పెద్ద మనుషులు, చిన్న బుద్ధులు.. నేనెక్కడికి వెళ్లాలి? ఇంకో ఇల్లు అద్దెకు తీసుకున్నా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. నేను ఎలా బతకాలి? అని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తకొందరు పెద్దలు మీడియాను తనకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారని, అయినా తాను భయపడనని ఆమె స్పష్టం చేశారు.