‘మా’ వివాదంలోకి శ్రీరెడ్డి.. నరేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు..  - MicTv.in - Telugu News
mictv telugu

‘మా’ వివాదంలోకి శ్రీరెడ్డి.. నరేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. 

October 24, 2019

Sri Reddy into controversy to MAA

నరేష్ సగం గోచి నువ్వే విప్పేసుకున్నావ్.. సగం గోచి ‘మా’ మెంబర్స్ లాగేశారు.. అంటూ ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై నటి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ‘మా’లో కొనసాగుతున్న వివాదం ఎటూ తేల్చుకోలేని స్థితిలో వుండగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ఎఫ్‌బీ అకౌంట్‌లో వరుసగా రెండు పోస్టులు పెట్టారు శ్రీరెడ్డి. 

మరో పోస్టులో ‘నరేష్‌గా నీ లాగ్ డైలాగ్స్ ఎంట్రా బాబాయ్.. దానికి తోడు కాకి స్వరం.. దిగిపోరా నీకెందుకు మా అసోసియేషన్’ అని పోస్టు చేశారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద దూమారమే చెలరేగింది. ‘మహిళవు అయిఉండి నీ మర్యాదను నువ్వు కాపాడుకో.. ఒక సీనియర్ నటుడుని పట్టుకుని అరేయ్.. తురేయ్ అంటావా?’ అంటూ నెటిజన్లు శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. గత 9 నెలలుగా ‘మా’లో ఫండింగ్ విషయమై అనుమానాలు వ్యక్తంచేసిన రాజశేఖర్‌, జీవితలు మొన్న జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ నరేష్ తరపు న్యాయవాది జీవితా రాజశేఖర్‌ను ప్రశ్నించారు. ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమేనని.. కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని వారు అన్నారు. దీనిపై నరేష్ స్పందించారు. ‘మా’లో ఏ సమావేశం జరిగినా దానికి తానే అధ్యక్షుడిగా ఉండాలని అన్నారు. జీవితా రాజశేఖర్ కూడా మంగళవారం జరిగిన సమావేశం గురించి స్పందించారు. సమావేశం ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. కాగా, శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ‘మా’లో కలకలం రేపుతున్నాయి.