మన సీఎంలు స్పందించకపోవడం దారుణం.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

మన సీఎంలు స్పందించకపోవడం దారుణం.. శ్రీరెడ్డి

April 10, 2018

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలపై సాగుతున్న లైంగిక దోపిడీని వ్యతిరేకిస్తూ నటి శ్రీరెడ్డి తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వద్ద ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. చివరికి న్యూయార్క్ టైమ్స్ కూడా ఆమెపై వార్త రాసింది. జాతీయ మీడియాలో వరస కథనాలు వెలువడుతున్నాయి.ఇంతమంది స్పందిస్తున్నా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు స్పందించడం లేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. “ప్రపంచమంతా నా నిరసన గురించి చర్చించుకుంటోంది. కానీ దీని గురించి మన మంత్రులు, ఇద్దరు సీఎంలు మాత్రం మాట్లాడక పోవడం చాలా బాధాకరం” అని ఆక్రోశం వెళ్లగక్కింది. టాలీవుడ్‌లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్‌పై కేసీఆర్ స్పందించకపోతే అందరిముందూ బట్టలు విప్పేస్తానని చెప్పిన శ్రీరెడ్డి అన్నంత పనీ చేసింది. మరోపక్క.. ఈ తతంగం వెనుక మహా న్యూస్ చానల్ హస్తముందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అవన్నీ అబద్ధమని, ఆ చానల్ శీలాన్ని శంకించకూడదని శ్రీరెడ్డి చెబుతోంది.