కేసీఆర్ గారూ.. మీరు స్పందించకపోతే నగ్నంగా నిలబడతా.. - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ గారూ.. మీరు స్పందించకపోతే నగ్నంగా నిలబడతా..

April 6, 2018

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై తన గొంతును బలంగా వినిపిస్తున్న నటి శ్రీరెడ్డి సంచలన ప్రకటనలు చేస్తోంది. శేఖర్ కమ్ముల, నాని, గాయకుడు శ్రీరామ్ వంటి వారిపై ఆరోపణలు చేయడం తెలసిందే. తాను వేలెత్తి చూపిస్తున్న అన్యాయాలపై స్పందించాలని ఆమె తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరింది.కేసీఆర్ తమ బాధలను అర్థం చేసుకుని స్పందించాలని ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. కేసీఆర్ దీక్ష చేసిన విజయం సాధించినట్లే తానూ ఆయన బాటలో నడుస్తానని పేర్కొంది. ఆయన స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని, జనం ముందు నగ్నంగా నిలబడతానని హెచ్చరించింది. టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలపై చెప్పలేని ఘోరాలు జరుగుతున్నాయని మరో పోస్ట్‌లో ఆరోపించింది.