ఏ తల్లీ వినకూడనివి వింటున్నాను.. శ్రీరెడ్డి తల్లి - MicTv.in - Telugu News
mictv telugu

ఏ తల్లీ వినకూడనివి వింటున్నాను.. శ్రీరెడ్డి తల్లి

April 11, 2018

సినీపరిశ్రమలో అమ్మాయిలపై వేధింపులను తన అర్ధనగ్న ప్రదర్శనతో వెలుగులోకి తీసుకొచ్చిన నటి శ్రీరెడ్డికి ఆమె కుటుంబంతో పెద్దగా అనుబంధం లేదని తెలిసింది. ‘శ్రీరెడ్డిని మేం కలవం. ఆమె చేసింది ధర్మమైతే మటుకు మా మద్దతు ఉంటుంది. కానీ ఏం జరుగుతోందో మాకు తెలియడం లేదు.. ’ అని ఆమె తల్లి తెలిపారు.

శ్రీరెడ్డి వివాదం నేపథ్యంలో ఓ టీవీ చానల్ ఆమె తల్లిని కలసి మాట్లాడింది. శ్రీరెడ్డికి చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టమని, కానీ తాము వద్దన్నామని ఆమె తెలిపారు. ‘శ్రీరెడ్డి మా మాట వినదు. ఆమె రూటే వేరు. పూజలు, సంప్రదాయాలు బ్రాహ్మణత్వం అన్నట్లు మా కుటుంబం ఉంటుంది. మా ఆయన నామం పెట్టుకుని, పూజల్లో వుంటారు.

ఆయన అసలు పేరు వెంకటరెడ్డి అయినా అందరూ వెంకన్న అంటారు.. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన తప్పే కాదో మేం ఇప్పటికీ నిర్ణయించుకోలేకపోతున్నాం. మాకు పేపరు రాదు, టీవీ లేదు, సినిమాలు చూడం.. తెలిసిన వాళ్లు శ్రీరెడ్డి విషయాలు చెబుతున్నారు. ఏ తల్లీ వినకూడనివి వింటున్నాను..‘నా పేరు చెప్పుకుని పదిమంది అన్నం తింటే నాకు సంతోషం’ అని శ్రీరెడ్డి చెప్పింది..’ అని తల్లి తెలిపారు.