శ్రీరెడ్డి ఎఫెక్ట్.. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డి ఎఫెక్ట్.. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు

April 12, 2018

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం ప్రభావం చూపుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఆమెకు అండగా ముందుకొచ్చింది. సినిమాల్లో నటించకుండా ఆమెను అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. టావీవుడ్‌లో లైంగిక వేధిపులపై తమకు పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభువాన్ని ఆదేశిస్తూ గురువారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదికలు పంపాలని స్పష్టం చేసింది.

శ్రీరెడ్డి అర్ధనగ్నప్రదర్శన, మీడియాలో ఆమెపై వస్తున్న కథనాలను సుమోటోగా స్వీకరించింది కమిషన్. మీడియాలో వస్తున్న కథనాలు నిజమే అయితే ప్రభుత్వాల వైఫల్యంగా భావించాల్సి వస్తుందని కమిషన్ పేర్కొంది.

ఆమెకు సినీ అవకాశాలు ఇవ్వకపోవడం, ఇతరులు ఆమెతో కలసి నటించడంపై నిషేధం విధించడం జీవనోపాధి, వ్యక్తి హుందా తనాన్ని దెబ్బతీయడమేనని ఆక్షేపించింది. శ్రీరెడ్డిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వస్తున్నవార్తలు చూస్తోంటే.. మా, రాష్ట్ర అధికారులు నిజాన్ని తెలిపే గొంతును నొక్కేస్తున్నట్లు భావించాల్సి వస్తోందని పేర్కొంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.