Sri Reddy on Pawan Kalyan and Chandrababu
mictv telugu

ఒరే పీకే.. గుర్తంచుకో.. నీ ప్రాణాలు కాపాడేది వైఎస్ జగనే

October 19, 2022

హాట్ బాంబ్ శ్రీరెడ్డి మళ్లీ లైవ్‌లోకి వచ్చేసింది. మంగళవారం ఏపీలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు రాజకీయంగా హీట్ పుట్టించిన విషయం తెలిసిందే. చెప్పుతో కొడతా, నేనేందో చూపిస్తా, ప్యాకేజ్ స్టార్ వంటి అంశాలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పీకేని ఏకిపారేసింది. రౌడీయిజం ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ ఫైర్ అయ్యింది. తనదైన శైలిలో బూతు మాటలతో వీడియో నింపేసింది.

అయితే అందులోనూ కొన్ని కీలక పాయింట్లను లేవనెత్తింది. వంగవీటి రంగాను చంపినట్టే పవన్ కల్యాణ్‌ను కూడా చంద్రబాబు చంపేస్తాడని హెచ్చరించింది. ‘నిన్ను బొల్లిబాబు నుంచి కాపాడేది సీఎం వైఎస్ జగనే’నని తేల్చి చెప్పింది. ‘అసలు పవన్‌కి వైజాగ్‌లో ఏం పని? నీకంటూ ఓ జెండా లేదు. ఓ ఎజెండా లేదు. ఆ బొల్లిగాడు ఏది చెప్తే అది చేయడ.. ప్యాకేజీకి కక్కుర్తి పడడం. రాడ్‌లతో వస్తారా? రాళ్లతో వస్తారా? అంటావా. ఇదిగో బాటా చెప్పు. దీంతో కొట్టానంటే మామూలుగా ఉండదు’ అంటూ పచ్చి బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఈ వీడియోని మేం మా సైట్‌లో పెట్టలేం కానీ, లింక్ ఇస్తున్నాం చూసుకోండి.