పవన్‌ను అన్నా అన్నందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

పవన్‌ను అన్నా అన్నందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా.. శ్రీరెడ్డి

April 16, 2018

జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌కు, క్యాస్టింగ్ కౌచ్‌పై నిరసన గళమెత్తిన నటి శ్రీరెడ్డి మధ్య వార్ ముదురుతోంది. అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లాలని, టీవీల్లో, రోడ్లపైకొచ్చి రచ్చ చేయొద్దని పవన్ అనడంపై శ్రీరెడ్డి మండిపడింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ కూడా కోర్టుకు, పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. దీంతో ఆమెపై పవన్ అభిమానులు వేధింపులకు దిగారు. సోషల్ మీడియాలో బెదిరిస్తూ పోస్టులు పెట్టారు. శ్రీరెడ్డి వీటిపై ఘాటుగా స్పందించారు.

‘పవన్ ఫ్యాన్స్.. దయచేసి నన్ను వేధించొద్దు. ముగ్గురు అమ్మాయిలను పెళ్లిచేసుకున్న నీకు అమ్మాయిలంటే విలువ ఉందా? నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలా? అసలు ఏమ్మాడుతున్నావ్ నువ్వు.. నేను ఒక తల్లిని ఏమీ అనాలనుకోవడం లేదు.. పవన్ కల్యాణ్‌ను అన్న అని అన్నందుకు నేను చెప్పు తీసుకుని కొట్టుకుంటున్నా.. దయచేసి ఏ అమ్మాయీ పవన్ కల్యాణ్‌ను అన్నా అని అనొద్దు.. పవన్ కల్యాణ్  మాదర్..’ అని బండబూతులు తిట్టింది శ్రీరెడ్డి.