నాకేమైనా జరిగితే మెగా ఫ్యామిలిదే బాధ్యత.. శ్రీరెడ్డి వాంగ్మూలం - MicTv.in - Telugu News
mictv telugu

నాకేమైనా జరిగితే మెగా ఫ్యామిలిదే బాధ్యత.. శ్రీరెడ్డి వాంగ్మూలం

April 23, 2018

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలపై లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న యువనటి శ్రీరెడ్డికి, ఆమెకు వ్యతిరేకంగా కత్తులు దీస్తున్న మెగా ఫ్యామిలీకి మధ్య వివాదం రగులుతుండడం తెలిసిందే. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి శ్రీరెడ్డికి రోజూ వందలాది బెదరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తీవ్రమైన హెచ్చరిక చేసింది.తనకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్య మెగా ఫ్యామిలీదే అని ఆమె తెలిపింది. ‘నాకేమైనా ఐతే మెగా ఫ్యామిలీదే బాధ్యత. మనసులో కక్ష వుంది… ఏం చేసినా వాళ్లదే బాధ్యత. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం. నా కేరీర్‌కు, ప్రాణానికి ముప్పు ఉంది.’ అని ఆమె ఫేస్‌బుక్‌లో తెలిపింది. గవర్నర్, హోంమంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిలను ట్యాగ్ చేసింది.

పవన్ అభిమానులు అక్కా అంటున్నారు..

శ్రీరెడ్డిని పవన్ కల్యాణ్ అభిమానుల్లో కొందరు వేధిస్తోంటే, మరికొందరు స్నేహితురాలిగా చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిసింది. ‘మానవత్వం బతికే ఉంది. ఫ్యామిలీ అంతా దూరమై ఏకాకినైన నాకు కొంతమంది పీకే ఫ్యాన్స్.. తిన్నారా అక్కా.. బాగున్నారా అని మెసేజ్ చేస్తుంటే కళ్లలో నీళ్లొచ్చాయ్. థ్యాంక్స్ టు గుడ్ పీకే ఫ్యాన్స్..’ అని శ్రీరెడ్డి తెలిపింది. మరో పోస్టులో పవన్‌ను తనను వేధిస్తున్న పీకే ఫ్యాన్స్‌ను ఎండగడుతూ.. ‘సారీ చెప్పుకున్న తర్వాత కూడా జులం ట్రోలింగ్ ప్రదర్శిస్తే మీ నాయకుడిని మీరే అవమానించుకున్నట్లు..’ అని మండిపడింది.