నా విజయం పవన్ తల్లికి అంకితం.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

నా విజయం పవన్ తల్లికి అంకితం.. శ్రీరెడ్డి

April 20, 2018

తనపై మెగా ఫ్యామిలీ చేసిన ఆరోపణలకు యువనటి శ్రీరెడ్డి ఘాటుగా బదులిచ్చారు. పవన్ తల్లిగారిని ఒక మాట అన్నందుకే అంతలా విరుచుకుపడుతున్నారని, మరి తమ తల్లులను అన్నప్పుడు, రోడ్డుపైన రేప్‌లు చేసినప్పుడు తామెంత బాధపడ్డామో వారికి అర్థం కాలేదా? అని ప్రశ్నించారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని ఆమె స్పష్టం చేశారు.

రాజకీయ డ్రామాలు తనకు చేతకాదని, చంద్రబాబు, నారా లోకేశ్‌, మరికొందరు రాజకీయ నేతలు తనకు అండగా ఉన్నారని పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ‘అభిమానులనే కంట్రోల్ చేసుకోలేని నువ్వు రేపు రాష్ట్రాన్ని ఎలా మేనేజ్ చేస్తావ్?’ అని ప్రశ్నించారు. పవన్ తల్లిని తిట్టడంపై స్పందిస్తూ.. ‘మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకంతే. మా మీద, మా తల్లులను అన్నప్పుడు రోడ్డు మీదకు రేప్‌లు చేస్తున్నప్పుడు, యాసిడ్‌ పోస్తున్నప్పుడు బెదిరింపులతో భయపెడుతున్నపుడు మా బాధ అర్థం కాలేదా?.. మీ ఆధిపత్యం సినిమాల్లో చూపించండి. ‘ మా’ఫిలిం ఛాంబర్‌ మీద చూపించకండి. జర్నలిస్టుల మీద బురద చల్లితే మీ మీదే  మరకలు పడతాయి. జర్నలిస్టుల జోలికి వస్తే బాగుండద’ని హెచ్చరించారు. తన పోరాటం చివరి వరకు కొనసాగుతుంది..’ అని పేర్కొన్నారు.

‘పవన్ అమ్మగారికి నా శిరస్సు వంచి సాష్టాంగం పడి లక్ష నమస్కారాలు.. క్షమించండి అమ్మా.. అమృతమూర్తి మీరు. మీ చెప్పుతో కొట్టండి నన్ను.. కానీ మిమ్మల్ని అంటే గాని కదల్లేదమ్మా ఈ మొండి బద్దకంతో ఉన్న సినిమా ఇండస్ట్రీ. మీ ఫొటో చూసి లక్షసార్లు క్షమించమని అడిగా.. నా విజయం  మీకే అకింతం చేస్తాను తల్లి.. ’ అని శ్రీరెడ్డి తెలిపింది.