చవకబారుతనం.. శ్రీరెడ్డిపై రామ్‌చరణ్ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

చవకబారుతనం.. శ్రీరెడ్డిపై రామ్‌చరణ్ ఫైర్

April 18, 2018

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న యువనటి శ్రీరెడ్డిపై మెగా ఫ్యామిలీ దాడికి దిగింది. పవన్ కల్యాణ్ ఆమెకు ఉచిత సలహా ఇవ్వడం, దీంతో ఆమె అతనికి కౌంటర్ ఇవ్వడంతో గొడవ కాస్తా శ్రీరెడ్డి వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్లు తయారైంది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగేంద్ర బాబు ఇప్పటికే శ్రీరెడ్డిపై విమర్శలు సంధించారు. కాసేపటి కిందట మరో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ కూడా స్పందించారు. శ్రీరెడ్డిది చవకబారుతనం అన్నట్లు ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

‘అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాప్యులర్ అవ్వాలని చూడటం చవకబారుతనంగా ఉంటుంది’ అని చెర్రీ పోస్టాడు. అంతేకాకుండా బాబాయ్ పవన్ కల్యాణ్ గతంలో అభిమానులను సహనంతో ఉండాలని చెప్పిన ఓ వీడియోనూ లింకు పెట్టాడు. దీన్ని ధరమ్ తేజ్ కూడా నిన్న పోస్ట్ చేశాడు.