రాంగోపాల్ వర్మ తిట్టమంటేనే శ్రీరెడ్డి పవన్‌ను బూతులు తిట్టింది - MicTv.in - Telugu News
mictv telugu

రాంగోపాల్ వర్మ తిట్టమంటేనే శ్రీరెడ్డి పవన్‌ను బూతులు తిట్టింది

April 18, 2018

జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌ను నటి శ్రీరెడ్డి తిట్టిన పెద్దబూతు మాట పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆవేశంలో అన్నానని, అందుకు క్షమాపణ చెబుతున్నానని శ్రీరెడ్డి చెప్పినా పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఆమెను వదలిపెట్టడం లేదు. సినీపరిశ్రమలోని చాలామంది శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు. రాంగోపాల్ వర్మ వంటి వారు ఆమెకు మద్దతిస్తున్నారు. పవన్‌ను శ్రీరెడ్డి అంత పెద్ద బూతు మాట అనడం వెనుక రాంగోపాల్ వర్మ ఉన్నాడని మహిళా హక్కుల నేత సంధ్య బాంబు పేల్చారు.

‘రేపు ప్రెస్ మీట్‌కు వెళ్తున్నానని శ్రీరెడ్డి.. వర్మకు చాటింగ్‌లో తెలిపింది. అతడు ఆ మాట అనమన్నాడు.. రిపీట్‌గా తిట్టమన్నాడు.. ఆ ఆవేశంలో శ్రీరెడ్డి ఆ మాట అనేసింది.. ముందుగా ఈ విషయం మాకు చెప్పి ఉంటే ఆ మాట అననిచ్చేవాళ్లం కాదు.. ’ అని సంధ్య ఓ టీవీ చానల్‌తో చెప్పారు. పవన్ అభిమానులు వేధించడంతో శ్రీరెడ్డి డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందని, తాను ఇంటికి తీసుకెళ్లి ఓదార్చానని తెలిపారు. విజయ్ దేవరకొండ కూడా ఆ బూతు మాటను పదేపదే అంటే అందరూ కేరింతలు కొట్టారని, శ్రీరెడ్డి అంటే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు.