5 కోట్లను తిరస్కరించిన శ్రీరెడ్డి.. పవన్‌ను నేనే తిట్టించా - MicTv.in - Telugu News
mictv telugu

5 కోట్లను తిరస్కరించిన శ్రీరెడ్డి.. పవన్‌ను నేనే తిట్టించా

April 18, 2018

క్యాస్టింగ్ కౌచ్‌పై నిరసన గళం విప్పిన యువనటి శ్రీరెడ్డి నోరెత్తకుండా దగ్గుబాటి కుటుంబం నుంచి రూ. 5 కోట్లు ఇప్పిస్తానని తాను చెప్పానని, అయితే ఆమెకు అందుకు తిరస్కరించిందని దర్శకుడు రాంగోపాల్ రెడ్డి వెల్లడించారు. జనాన్ని ఆకర్షించేందుకు పవన్ కల్యాణ్‌ను తిట్టాలని తానే ఆమెకు చెప్పానని, అందుకు క్షమాపణ చెబుతున్నానని బుధవారం తెలిపారు. పవన్‌కు, ఆయన అభిమానులకు క్షమాపణ చెబుతున్నానన్నారు.

‘కత్తి మహేశ్ గురించి ఎవరికీ తెలియదు. కత్తి పవన్ కల్యాణ్‌ను విమర్శించాకే అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ వల్లే మహేశ్‌కు అటెన్షన్ వచ్చింది. ఒక మనిషి దెబ్బలాడాలంటే ధైర్యం ఉండాలి.. అందరికన్నా పెద్ద నటుణ్ని తిడితే ఫోకస్‌లోకి వస్తాం.. అందుకే పవన్‌ను అలా తిట్టమని నేనే చెప్పాను.. ఇది నా తప్పు, ఆ అమ్మాయి తప్పుకాదు’ అని వర్మ చెప్పారు. పవన్ కల్యాణ్‌ను కేసీఆర్ తాట తీస్తానని అన్నారని, కానీ తర్వాత వారిద్దరూ కలసి భోంచేశారని.. మాటల తీవ్రత అప్పటికే ఉంటుందని అన్నారు.

దగ్గుబాటి సురేశ్ తనయుడు అభిరాం, శ్రీరెడ్డిల వ్యవహారంపైనా వర్మ స్పందించాడు. ‘రామానాయుడు స్టూడియో అంత పెద్ద సంస్థలో ఏదైనా జరిగితే ఏంటని అనిపించింది. శ్రీరెడ్డికి ఫోన్ చేశాను.. శ్రీరెడ్డి ఇండస్ట్రీలో ఉండాలి.. సురేశ్ ఫ్యామిలితో చాలా డబ్బుల్ని శ్రీరెడ్డికి ఇప్పిస్తే బాగుటుందని అనుకున్నాను.. అభిరాంను కాకుండా మొత్తం ఫ్యామిలీని శిక్షించడం సరికాదనిపించింది… సురేశ్‌కు తెలియకుండా ఆ ఫ్యామిలీ నుంచి నాలుగైదు కోట్లు ఇప్పిస్తా, నువ్వు ఇక మౌనంగా ఉండు అని శ్రీరెడ్డికి చెప్పాను.. కానీ శ్రీరెడ్డి ఒప్పుకోలేదు. ఇది నాకు బిగ్గెస్ట్ షాక్..  ‘నా పోరాటం అమ్మాయిలక ఉపయోగపడుతోంది.. ఈ విషయంలో నేను ఎవరివద్దయినా డబ్బు తీసుకుంటే నేను అద్దంలో నా ముఖాన్ని చూసుకోలేను’ అని ఆమె చెప్పింది’ అని వర్మ తెలిపారు.