పేరు మార్చుకున్న శ్రీరెడ్డి.. ఇకపై శ్రీశక్తి.. - MicTv.in - Telugu News
mictv telugu

పేరు మార్చుకున్న శ్రీరెడ్డి.. ఇకపై శ్రీశక్తి..

April 14, 2018

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్పై అర్ధనగ్న ప్రదర్శనతో సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి మరో నిర్ణయం తీసుకున్నారు. తన పేరులోంచి రెడ్డిని తీసిపారేశారు. ఇకపై తన పేరు శ్రీశక్తి అని అన్నారు. ‘నేను ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుంటున్నాను. నా పేరులోని ‘రెడ్డి’ పదాన్ని మోయడం బరువుగా అనిపిస్తోంది.. అందుకే ఇక నా పేరు శ్రీరెడ్డి కాదు శ్రీశక్తి.. నాకు సంబంధించిన మీడియా వార్తలు రాసేటప్పుడు, చదివేటప్పుడుగానీ శ్రీశక్తి అనే రాయండి, చదవండి’ అని శ్రీశక్తి పేర్కొంది.


టాలీవుడ్‌లో అమ్మాయిలపై అన్యాయాల గురించి ఆమె మళ్లీ మండిపడింది. థియేటర్లు నిర్మాత దిల్‌రాజు చేతుల్లోంచి ఎప్పుడైతే బయటికి వస్తాయో అప్పటివరకు నేను శ్రీశక్తిగానే ఉంటాను. థియేటర్లకు బడాబాబుల నుంచి విముక్తి కలగాలి. నా ఉద్యమం ఇంత తీవ్రమవుతుందను నేనే ఊహించలేదు. నా వల్ల మరికొంతమంది అమ్మాయిలు బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాలను లోకానికి చెబుతున్నారు. ఎక్కడ ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా అక్కడకు వెళ్లి వారికి న్యాయం చేస్తాం’ అని ఆమె పేర్కొంది.